శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బక్తుల సేవే పరమావధిగా తలచి సేవ చేస్తున్న పోలీసులు.
తిరుమల ముచ్చట్లు:
వృద్ధురాలికి సహాయం చేస్తూ మానవత్వం చాటుకున్న బాపట్ల జిల్లా, సుండూరు పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్ రాజశేఖర్.కానిస్టేబుల్ రాజశేఖర్ ను అభినందించిన జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,”మానవసేవే మాధవసేవ” అనే నినాదంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బందోబస్తు విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ . పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు, సూచనలు ఇది వరకే చేసి ఉన్నారు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుకి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయింది స్వామీ సాక్షాత్కారం కోసం.. తనివి తీరా చుసి ఆనందించాలని తపించి పోతుంటారు భక్తులు కానీ కొంత మందికి దేవున్ని సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది మరి కొంత మందికి ఆయన పిలుపు మేరకు ఒక ఒక సహాయ కారిని పంపి ఆయన దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు అదేవిధంగా…..

ఉదయం అదే క్రమమంలో బందోబస్తు విధుల నిమిత్తం తిరుమలకు వచ్చిన బాపట్ల జిల్లా, సుండూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ జిల్లా ఎస్పీ గారి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ తిరుమలలోని రాంబాగీచ బస్టాండ్ దగ్గర ఊద కర్ర సహాయంతో తన లగేజి నీ మోయలేక మోసుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధురాలికి తన వంతు సహాయం చేశాడు. వృద్ధురాలి యొక్క లగేజ్ బ్యాగ్ ను ఒక చేత పట్టుకుని మరో చేతితో ఆమె చేయిని పట్టుకుని జాగ్రత్తగా వృద్ధురాలుని తను చేరవలసిన స్థానానికి చేర్చారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు, సాటి పోలీసులు, స్థానికులు కానిస్టేబుల్ రాజశేఖర్ గారి ఉదార స్వభావాన్ని మెచ్చుకున్నారు.విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., సదరు కానిస్టేబుల్ రాజశేఖర్ గారిని అభినందించారు. ఈ కానిస్టేబుల్ ని ఆదర్శంగా తీసుకుని మిగతా పోలీసులందరూ కూడా భక్తి భావం కలిగి మానవతా దృక్పథంతో శ్రీవారి భక్తులకు నిత్యం సేవ చేయాలని పిలుపునిచ్చారు.
Tags: The policemen are serving in Srivari Brahmotsavam considering the service of devotees as supreme.
