పారికర్ మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు

    Date:18/03/2019

   పానాజీ  ముచ్చట్లు:
గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పారికర్ స్థానంలో కొత్త మరొకర్ని సీఎంగా ప్రకటించడానికి బీజేపీ సిద్ధపడుతుండగా.. కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. మనోహర్ పారికర్ అంత్యక్రియలైనా పూర్తి కాక ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతినిధుల బృందం గవర్నర్ మృదులా సిన్హాను కలిసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన తమకు  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ కోరింది.  కాంగ్రెస్ ప్రతినిధులు గోవా గవర్నర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పారికర్ మరణం బాధాకరం అంటూనే.. అధికారాన్ని తమకు బదిలీ  చేయాలని కోరారు. పారికర్ సీఎంగా ఉంటారనే నిబంధన ప్రకారమే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిగతా పార్టీలు అంగీకరించాయి. రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు  పారికర్ మన మధ్య లేరు. కాబట్టి బీజేపీతో ఇతర పార్టీలకు ఇప్పుడు ఎలాంటి పొత్తు లేదని ఆ లేఖలో కాంగ్రెస్ పేర్కొంది. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్కు 14 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, బీజేపీకి 11 మంది  సభ్యులున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎంజీపీ, ఇండిపెండెంట్లు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఎన్సీపీ నుంచి ఒకరు, మరొకరు స్పీకర్ గా ఉన్నారని హస్తం పార్టీ పేర్కొంది. పారికర్ అంతిమ సంస్కారాలు కూడా పూర్తి కాకముందే ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ కోరడం విమర్శలకు తావిస్తోంది. ఇంత కంటే దారుణం ఏముంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Tags:The political turn of the state with the death of Parraker is a new turn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *