Natyam ad

విద్యావిధానంపై రాజకీయాలు

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీలో విద్యా విధానంపై తీసుకుంటున్న నిర్ణయాల చుట్టూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం అంటూ ఇంగ్లీష్ మీడియంతో పాటు బైజూస్ కంటెంట్.. 3వ తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ఈ విధానాల్లో ఏదో లోపముందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. మూడవ వతరగతి పిల్లలకు నిజంగా టోఫెల్ అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంగ్లీష్ రాకపోతే ఇక బతుకే లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పిల్లలు చదువుతుంటే ఎందుకు పవన్‌కి అక్కసు ఎందుకని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఇలాంటి ప్రతిపక్ష నాయకుల వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.ఎవరేమి అనుకున్నా కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్ధులకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి బొత్స. ఇలా ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి టోఫెల్ శిక్షణ వరకు అన్ని అంశాలపైనా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఎవరేమి అనుకున్నా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ విధానమంటోంది ప్రభుత్వం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి ఒక మంచి ప్రవర్తన ఏర్పడేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.ఏపీలో టోఫెల్(ఈటీఎస్), ఇంటర్నేషనల్ బాకలారియట్(ఐబీ) సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

 

ప్రతిదానికి టెండర్ అవసరం లేదని, తాము దీన్ని సమర్థించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. టోఫెల్, ఐబీ అత్యుత్తమమని భావిస్తున్నామని.. అందుకే ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని ముందుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేశామని. ఈ కమిటీ సూచనతో ఐబీని ఎంపిక చేసి, రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో ఐబీ అమలుపై అధ్యయనం చేసేందుకు ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఆర్థిక సంబంధమైన అంశాలు గానీ, ఈ స్థాయిలో చెల్లింపులు గానీ ఏమీ లేవు. అధ్యయనానికి ఆరు నెలలు సమయం ఉందని, ఆ తర్వాతే అమలుకు ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఐబీ, టోఫెల్ అమలుతో ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనే ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదవారికి నాణ్యమైన విద్య అందకూడదా? అని మంత్రి ప్రశ్నించాలరు. ఐబీని మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఐబీ అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర బోర్డు, ఐబీ కలిసి సంయుక్తంగా సర్టిఫికేషన్ ఇవ్వనున్నాయని, టోఫెల్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఎవరేమనుకున్నా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రభుత్వం అన్నీ పారదర్శకంగా చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

 

Post Midle

Tags:The politics of education

Post Midle