అమరావతి ముచ్చట్లు:
పోలింగ్ బూత్ కమిటీల నియామకాన్ని వైసీపీ పూర్తి చేసింది. ప్రతీ వార్డుకు ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 15మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47వేల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది వైసీపీ. మేుము సిద్ధం- మా బూత్ కమిటీలు సిద్ధం అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఎన్నికలకు దాదాపు 50 రోజుల ముందే బూత్ కమిటీలు పూర్తి చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది.ఎన్నికల సమరానికి అధికార వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అన్ని విషయాల్లో ప్రత్యర్థులకన్నా ముందు ఉంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలకన్నా ముందుంది. ఇప్పుడు పోలింగ్ బూత్ ల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలతో పోల్చి చూస్తే అధికార వైసీపీ ఒక మెట్టు ముందు ఉంది.
Tags: The polling booths are set up 50 days before the election