చెరువులు కబ్జాకు గురయ్యాయి గోనే ప్రకాశ రావు     

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై పలు ఆరోపణలు
నిర్మల్  ముచ్చట్లు :
నిర్మల్ జిల్లా కేంద్రం లోని బిజెపి నాయకుడు అంజుకుమార్ రెడ్డి ఇంటిలో  ఆర్.టి.సి మాజీ చైర్మెన్ గోనె ప్రకాశ్ రావు  మీడియాతో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులు కబ్జాకు గురయ్యాయి . ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక చెరువులో కలెక్టర్ కార్యాలయాలు నిర్మిస్తున్నారు . దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుంది . మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఊరికి దగ్గర చెరువులో నిర్మిస్తున్నాడు, మంత్రికి అక్కడ ఒక వంద యాభై ఎకరాలకు పైగా భూమి ఉంది . దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుంది . ధర్మసాగర్ చెరువు వాక్ వే  అవతల శిఖం వదిలారు అది కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది . మంత్రి థియేటర్ సైతం శిఖంలో కట్టారు . మంత్రి గతంలో సారా కాంట్రాక్టర్ అప్పుడు జరిగిన అవకతవకలపై సైతం ఫిర్యాదు చేశా, వెలుగులోకి తెచ్చా . మంత్రి జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడు ఒక్క కోనప్పతో సఖ్యత ఉంది, అది సైతం ఇప్పుడు అది కూడా లేదు . నిర్మల్ గొలుసుకట్టు చెరువుల కబ్జాలపై బెంగుళూరులోని గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తా . తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదు . కుటుంబ తగాదాలను తెలంగాణలో అంటగట్టాలని చూస్తోంది . షర్మిల కు పదవి ఇవ్వనందుకే పార్టీ పెట్టిందని అయన వ్యాఖ్యానించారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The ponds were captured
Gone Prakash Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *