ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులకు ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం

Date:16/07/2018
లక్నోముచ్చట్లు:
ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులకు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం రాబోతుంది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన చట్టాన్ని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని సోమవారం యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటి వరకు యూపీ, ఉత్తరాఖండ్‌లలో మాత్రమే ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం లేదు. ఈ సదుపాయం లేకపోవడం వల్ల క్రిమినల్‌ కేసుల్లోని నేరస్థులను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తున్నారు. కావాలంటే నిందితులు ఆ తర్వాత బెయిల్‌ పొందే విధంగా అక్కడి చట్టాలు ఉన్నాయి. 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాతి సంవత్సరం నుంచి యూపీలో ముందస్తు బెయిల్‌ ఆప్షన్‌ లేకుండా ఎత్తివేశారు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో ముందస్తు బెయిల్‌ సదుపాయాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించి తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై యూపీ ప్రభుత్వం స్పందించింది. నిబంధనలు రూపొందించేందుకు వారం రోజుల సమయం కావాల్సిందిగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.ఈ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు అరెస్టు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ ఆప్షన్‌ను ఈ రెండు రాష్ట్రాల్లో అందుబాటులో లేకుండా చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులకు ముందస్తు బెయిల్‌ పొందే అవకాశంhttps://www.telugumuchatlu.com/the-possibility-of-obtaining-an-advance-bail-to-uttar-pradesh/
Tags: The possibility of obtaining an advance bail to Uttar Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *