కూటమికి అధికారం ఖాయం

The power of the alliance is guaranteed

The power of the alliance is guaranteed

Date:09/11/2018
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో  మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పాల్గోన్నారు.ఈ  ప్రాంతం అనేక అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు అవకాశం కల్పించారని అన్నారు. ఆయన అభివృద్ధి పథంలో నడపడంలో విఫలమయ్యాడని విమర్శించారు.  రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.  ఈ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికలు మహాకూటమి చేపడుతుందని అన్నారు.
కూటమి అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువస్తామని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని తన చివరి క్షణం వరకు ఈ ప్రాంతానికి తాను సేవ చేసేందుకు ముందు కుంటానని  తెలిపారు.  ఈ సందర్భంగా కార్యకర్తలు  మహేశ్వరం సీటును మహాకూటమిలో తెలుగుదేశం కేటాయించాలని పలువురు వినతి చేశారు. సమావేశంలో  మాట్లాడుతూ దేవేందర్ గౌడ్ భావోద్వేగానికి గురయ్యారు .
తన రాజకీయ జీవితంలో అనేక సంఘటనలు నెమరువేసుకుంటూ ఇక్కడ అప్పట్లో జరిగిన సందర్భాలు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు ఏదేమైనా ఈ ప్రాంతం లోనే ఉంటూ అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధిలో ముందు తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షులు వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ కూటమిలో ఎవరికి వచ్చినా లక్ష్యం టిఆర్ఎస్ నీ ఓటమి దిశగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Tags: The power of the alliance is guaranteed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *