మద్దతు ధర పెంచినా…లాభం లేదు

Date:14/07/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం 14 రకాల వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పత్తిపై రూ.1130, ధాన్యం రూ200లు, జొన్నలపై రూ.640, కందులపై రూ.225, మినుములపై రూ.200 పెంచింది. ఈ మద్దతు ధరలు సరిగ్గా అమలు జరిగినా రైతుకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఎందుకంటే గడచిన రెండు సంవత్సరాలలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా దుక్కి ఖర్చు దాదాపు రెట్టింపు అయ్యింది. డీజిల్ ధరలు, ట్రాక్టర్ విడి భాగాల ధరలు విపరీతంగా పెరగడంతో దుక్కి ధరలు పెరిగాయి. ఎకరాకు ఒక సాలుకు గతంలో రూ.600-800లు తీసుకోగా ఇప్పుడు రూ.1200-1400 తీసుకుంటున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ యాజమానులది పెంచక తప్పని స్థితి. ఇక విత్తన ధరలు పెరిగాయి. ఈ సంవత్సరమే ప్రభుత్వం రసాయనిక ఎరువుల ధరలను పెంచింది. డిఏపిపై రూ.130, యూరియాపై రూ.36, కాంప్లెక్స్ ఎరువులపై రూ.106, పోటా షియం పై రూ.70 పెంచారు. దీనికి తోడు వ్యవ సాయ కూలీ పెరిగింది. మూడు సంవ త్సరాల క్రితంతో పోలిస్తే కూలీ దాదాపు రెట్టింపు అయ్యింది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగినా పెట్టుబడులు మాత్రం తగ్గ లేదు. ఇక దిగు బ డులు ఇటీ వల కాలంలో గణనీయంగా తగ్గాయి. ప్రతికూల వాతావ రణ పరి స్థితులు, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అతి వృష్టి, అనా వృష్టి, అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు దిగుబడులను తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు గతంలో పత్తి సగటు దిగుబడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక రాకు 10 క్వింటాళ్లు ఉండగా పోయిన సంవ త్సరం ఆరు క్వింటాళ్లకు పడి పోయింది. ఖరీఫ్ ధాన్యం దిగుబ డులు తగ్గిపోయాయి. మిగి లిన పంటల పరి స్థితి ఇందుకు భిన్నంగా లేదు. ప్రతి కూల వాతా వ రణ పరి స్థితుల కారణంగా తెగుళ్లు, క్రిమికీట కాల ప్రభావం పెరి గింది. ఇందుకు అదనంగా క్రీమి సంహారక మందులను వినియోగించడంతో పెట్టు బడి అదనమవుతుంది. పైన పేర్కొన్న అంశా లను కేంద్ర ప్రభుత్వం పరి గ ణ లోకి తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి, రైతు శ్రమ పరిగణలోకి తీసుకుంటే మద్దతు ధర పెరిగేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం మద్దతు ధర ప్రక టించి తమ పనిపూర్త యిం ద న ట్లుగా వ్యవ హ రి స్తుంది. పలు సంద ర్బాల్లో మద్దతు ధరకు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. ఉదాహారణకు కందుల మద్దతు ధర రూ.5450 ఉండగా కనీసం రూ.4వే లకు కూడా కొనుగోలు చేయలేదు. మార్క్ ఫెడ్, ఇతర ప్రభుత్వ సంస్థలు మద్దతు ధర అంటూనే రకరకాల కొర్రీలు పెడుతుండడంతో ప్రైవేటు వ్యాపా రు లకు విక్ర యిం చక తప్పని స్థితి.పలు సంద ర్బాల్లో మిగిలిన పంటల విష యం లోనూ ఇదే జరిగింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయరంగానికి జీవం పోసే దిశగా లేవని రైతులు, రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నారు.
మద్దతు ధర పెంచినా…లాభం లేదుhttps://www.telugumuchatlu.com/the-price-of-support-increased-no-profit/
Tags: The price of support increased … no profit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *