పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే..కేసీఆర్ కు గుడి

Date:18/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
రైతులు పండించిన అన్ని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన జగ్గారెడ్డి.. ఈ నిర్ణయాన్ని ఏడాదిలోపు అమలుచేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను స్వయంగా గుడి కట్టిస్తానని అన్నారు. అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీకి కూడా ఆలయాలు కట్టిస్తానని ఆయన తెలిపారు. నల్గొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, జహీరాబాద్ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికి ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రకటించిన ‘న్యాయ్’ పథకం ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లుంటే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మైనార్టీలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారని తెలిపారు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించే కేసీఆర్ అదే పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని ఆరోపించారు.
Tags:The price of the crop is given

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *