పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

-సీపీఎం సీపీఐ, న్యూ డెమోక్రసీ డిమాండ్

కౌతాళం ముచ్చట్లు:

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను ఈ నెల 18 రోజుల్లోనే 11 సార్లు పెంచిందని, అలాగే గ్యాస్ ధరలు మే 2 తర్వాత రెండుసార్లు పెంచిందని, వంట నూనె మరియు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ధరలు తగ్గించాలని కోరుతూ వామపక్షాల పిలుపుమేరకు కౌతాళం మండల కేంద్రంలో సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహం దగ్గర ట్రాక్టర్, ఆటో, స్కూటర్ ను తాడుతో లాగి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు  మల్లయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి  లింగన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు జగదీష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపడం పనిగా పెట్టుకుందని వారు విమర్శించారు. కరొన కష్టకాలంలో బ్రతకడమే కష్టంగా ఉంటే ధరలు పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.. అసలు ధర కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులు అధికంగా ఉన్నాయని వారన్నారు. వామపక్షాల పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కౌతాళం లో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు వీరేష్, రామలింగా, మహబూబ్, వెంకన్న, ఈరన్న, రామంజి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు మల్లి, గోపాల్, ఖాదర్ కూలీలు రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: The prices of petrol, diesel, gas and essential commodities should be reduced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *