ప్రధాని చేసిన కుట్ర ఇది : మంత్రి సోమిరెడ్డి

The Prime Minister's conspiracy is this: Minister Somireddy

The Prime Minister's conspiracy is this: Minister Somireddy

Date:14/09/2018
నెల్లూరు ముచ్చట్లు:
సీఎం  చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తూ నోటీసులు ఇచ్చారు.  ముందస్తు నోటీసులు ఏమి ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ ఇవ్వడం దారుణమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  ప్రజా ఉద్యమాలు అనేకం చేస్తూ ఉంటారు, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎనిమిదేళ్ల క్రితం కేసుకు నోటీస్ ఇస్తారా.
మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోడీ కలిసి చేస్తున్న కుట్ర ఇదన ఆరోపించారు.  మీ రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారు.  బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ అడ్డుకోలేకపోయాడు.  రాహుల్ గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది నేతలకు మోడీ నోటీసులు ఇస్తున్నారు.  కర్ణాటకలో యడ్యూరప్ప ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచితే నోటీసులు ఇవ్వగలిగారా అని ప్రశ్నించారు.  తెలంగాణాలో మహాకూటమికి షాక్ ఇవ్వాలని సీఎంకు వారెంట్ ఇచ్చారు.
అభివృద్ధికి కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోతోంది, తట్టుకోలేకే  మోడీ ఇలా వ్యవహరిస్తున్నారు.  మోడీ పద్ధతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా ప్రజలు తిరగపడుతారని అయన హెచ్చరించారు. శనివారం  సాయంత్రం నెల్లూరు నగరంలో భారీ నిరసన కార్యక్రమం పెడుతున్నాం.  24 గంటల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కేసును వాపసు తీసుకోవాలి, లేకుంటే ప్రజల ఆగ్రహం తప్పదని అయన అన్నారు.
Tags:The Prime Minister’s conspiracy is this: Minister Somireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *