Natyam ad

ప్రధాని పర్యటన విజయవంతం

విశాఖపట్నం ముచ్చట్లు:


ప్రధాని మోదీ రెండు రోజు ల విశాఖ పర్యటన విజయవంతం అ యిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసిం హారావు తెలిపారు.వ్యక్తిగతంగా తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిం దన్నారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థా పనలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తు న్న సహకారానికి నిదర్శనమన్నా రు.ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ ఉంటుందా లేదా అనే చర్చలు సాగా యని,ప్రధాని రాకకంటే ఒక రోజు ముందే ఈనెల 10న జోన్ ను నిర్ధా రిస్తూ నోటిఫికేషన్ వెలువడిందన్నారు. రాయ గడ డివిజ న్,విశాఖ జోన్లకు 106 కోట్లు మంజూరు చేశారన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధానకార్యాలయం ఎక్కడ నిర్మించా లో చర్చించారని, నిర్మాణ ప్రక్రియ త్వ రలోనే మొదల వుతుందన్నారు.బీజేపీ ఏపీ కోర్ కమి టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం లో ఏపీ బీజేపీ అధ్య క్షుడు సోము వీర్రాజును ప్రధాని మోదీ మీ పేరు ఏంటి అని అడిగినట్లు వార్తలు వెలువ డ్డాయని ఈ వార్తలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదన్నారు. అందరినీ పరిచయం చేసుకోవాలని ప్రధాని కోరడంతో సోము వీర్రాజు అలా ప్రారంభిం చారని చెప్పారు.

 

Tags: The Prime Minister’s visit was a success

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.