Natyam ad

పుంగనూరు సచివాలయాల్లో సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయాలకు అందే సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సచివాలయ కార్యదర్శులు పని చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో రాజేశ్వరి, ఈవోపీఆర్‌డి కృష్ణవేణితో కలసి కుమ్మరనత్తం , గుడిసెబండ సచివాలయాలను తనిఖీ చేశారు. అలాగే కపాడంమిట్టపల్లె హైస్కూల్‌లో, అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల హాజరు, అర్జీల ఆన్‌లైన్‌ నమోదు, పరిష్కారం గురించి రికార్డులు పరిశీలించారు. అలాగే ఆర్‌బికెల ద్వారా రైతులకు అందిస్తున్న ఎరువులు, విత్తనాలు , సేవలు గురించి చర్చించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; The problems in the Punganur secretariats should be resolved immediately

Post Midle