రెవెన్యూలో సమస్యల తిష్ట

The problems in the revenue are tough

The problems in the revenue are tough

– పరిష్కారం కానీ ధరఖాస్తులు

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని తహశీల్ధార్‌ కార్యాలయాల్లోను, రెవెన్యూ సమస్యలు తిష్ట వేశాయి. ధరఖాస్తులు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ప్రతి ధరఖాస్తు వెనుక లిటిగేషన్‌ అన్న పేరుతో రెవెన్యూ అధికారులు పెండింగ్‌లో ఉంచేస్తున్నారు.

పుంగనూరు …

పుంగనూరు తహశీల్ధార్‌ కార్యాలయానికి గురువారం గతంలో గృహ నిర్మాణాలకు ధరఖాస్తు చేసిన నలుగురు మహిళలు వచ్చారు. తమకు ఇండ్ల స్థలం కేటాయించాలని, పలుమార్లుగా తిరుగుతున్నామని తెలిపారు. అలాగే పాల్యెంపల్లె, పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటకు చెందిన వారు భూ సమస్యలపై వచ్చారు. కాగా తహశీల్ధార్‌ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి 142 ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే రెవెన్యూ రికార్డులలో పేర్ల నమోదు కోసం 174 ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూ సర్వేలకు సంబంధించి 62 ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన ఇతరత్రా సమస్యలు 115 ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయమై తహశీల్ధార్‌ మాదవరాజు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికుప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం జరుగుతున్నందున ఈ ధరఖాస్తులు పెండింగ్‌లో ఉంటాయన్నారు. కార్యక్రమం పూర్తికాగానే పరిష్కరిస్తామన్నారు. కొన్ని భూ సమస్యల పై కోర్టుల్లో కేసులు ఉన్న కారణంగా పరిష్కారం కాకుండ పోతోందన్నారు. ఈ ధరఖాస్తులను కోర్టు తీర్పుమేరకు పరిష్కరిస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీలో బిసిలకు సముచిత న్యాయం కల్పిస్తాం

Tags: The problems in the revenue are tough

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *