Natyam ad

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి..

 

విజయనగరంముచ్చట్లు:

Post Midle

అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు  రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట  సిఐటియు ఆధ్వర్యంలో  భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  చిన్నచూపు చూస్తుందని, ఎన్నికల అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిందని  ఆరోపించారు. అంగన్వాడీలకు 15 వేల రూపాయలు జీతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు నిరసన చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇది ప్రజా ఉద్యమంగా  మారిందని, తక్షణం స్పందించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామన్నారు.

Tags: The problems of Anganwadis should be solved.

Post Midle