ఏపీ మున్సిపల్ వర్కర్ల   సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎమ్మిగనూరు పట్టణంలో ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు  ఎమ్మిగనూరులో  మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గంగారెడ్డికి సమ్మె నోటిస్

అందజేయడం జరిగింది
అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునెప్ప, తాలూకా  కార్యదర్శి తిమ్మ గురుడు  మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ నగర

పంచాయతీల లో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ మరియు పర్మినెంట్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు స్కూల్ స్వీపర్సు డ్రైవర్స్ టాయిలెట్ వర్కర్స్ సమస్యల

పరిష్కారానికై ఈ నెల 27 వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలన్నీ సమ్మెలోకి పోవడం జరుగుతుందని అన్నారు
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ లో

పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని చనిపోయిన వారి కుటుంబంలో 60 సంవత్సరములు దాటిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

కల్పించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు వీరేష్, బజారి, దాదావలి, ఎల్లప్ప, శాంతప్ప, కాజా, సుంకన్న, ఇస్మాయిల్, ముక్తార్, ఆనంద్,విక్రం,ఉరుకుందు దేవదాస్,గోర్

భాష, నాయకులు  కార్మికులు పాల్గొనడం జరిగింది

 

Tags: The problems of AP municipal workers should be solved

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *