త్రాగునీటి కార్మికుల సమస్యలను పరిష్కారించాలి

కళ్యాణదుర్గం ముచ్చట్లు:

 

కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక శ్రీరామిరెడ్డి త్రాగునీటి పధకం కార్మికుల డివిజన్ జనరల్ బాడీ సమావేశం శ్రీరామిరెడ్డి త్రాగునీటి పధకం యూనియన్ కార్యదర్శి ప్రభాకర్ అధ్యక్షతన  జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా సిఐటియీ రాష్ట్ర నాయకుడు ఓబులు, జిల్లా కమిటీ సభ్యులు మన్నీల రామంజి, ,కళ్యాణదుర్గం సిఐటియీ డివిజన్ నాయకుడు అచ్యుత్ ప్రసాద్  హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐటియీ రాష్ట్ర నాయకుడు ఓబులు  మాట్లాడుతూ త్రాగునీటి కార్మికుల సమస్యలను పరిష్కారించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు అందుకనే జులై 10న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపడుతున్నామన్నారు ప్రధానంగా 10 నెలల పిఎఫ్ బకాయిలు చెల్లించాల్సి వుంది అయితే ముందువున్నటువంటి కాంట్రాక్టర్ కట్టాలి అని ఇప్పుడున్న కాంట్రాక్టర్ అంటూ కార్మికులకు అందాల్సిన పిఎఫ్ డబ్బులు అందకపోవడం .కరోనాతో మరణించిన వారికి 50 లక్షల భీమా వర్తింప చేయాలని,పెండింగ్‌లో ఉన్న పిఎఫ్ డబ్బులు, మూడు నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చెస్తున్నాం అలాగే ఏప్రిల్ నెల నుండి కొత్త వేతనాలు 21 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.కరోనా సమయంలో సరైన భద్రతా చర్యలు తీసుకుపోగా చాలామంది కార్మికులు కరోనా బారీన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని జులై 10 నుండి అన్ని పంప్ హౌస్ లను బంద్ చేసి సమ్మె చేపడుతున్నామని దినిని గమనించి ప్రజలు కూడా మద్దతు తెలపాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియీ నాయకుడు అచ్యుత్ ప్రసాద్, శ్రీరామిరెడ్డి త్రాగునీటి పధకం యూనియన్ నాయకులు ప్రభాకర్,నాగరాజు,రమేష్,మహేష్,నరేష్,నరసింహులు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The problems of drinking water workers need to be addressed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *