గోపాలమిత్ర ల సమస్యలు పరిష్కరించాలి
కడప ముచ్చట్లు:
: కడప నగరంలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కి గోపాలమిత్ర సమస్యలు పరిష్కరించాలని పత్రం ఇవ్వడం జరిగింది పశుసంవర్ధక శాఖలో గత 20 సంవత్సరాల నుండి గోపాల మిత్రులు గాగ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులకు సేవలు చేస్తూ ఉన్నారు . అటువంటి గోపాల మిత్రులు సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనురు శ్రీనివాసులు రెడ్డి యూనియన్ అధ్యక్షులు
మల్లేషు జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా గోపాల మిత్రులకు 6500 రూపాయలు వేతనం ఇస్తున్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18 వేల
రూపాయలు ఇవ్వాలనే. రైతు భరోసా కేంద్రానికి అప్పజెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది రైతు భరోసా కేంద్రం లో పని చేయడానికి అభ్యంతరం లేదని కానీ వేతనం కేవలం 6500 మాత్రమే
ఇస్తామని చెప్తున్నారు అది కూడా మాకు 6500 చాలు అనే అంగీకార పత్రం పైన సంతకాలు చేయాలని అధికారులు కోరుతున్నారు మేమైతే రైతు భరోసా కేంద్రాలు పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం
లేదు రైతు భరోసా కేంద్రాలు వెళ్లేముందు అందర్నీ ఏ పి సి ఓ ఎస్ లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాలపైన జెడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు పరిశీలించి వానికి ఆర్థిక
శాఖకు పంపిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ప్రధానమైన సమస్యలు మిత్రులందరికీ వ్యక్తిగత 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి పెట్రోల్ అలవెన్స్ ఇవాలి విధినిర్వహణలో
కాలు, చెయ్యి కి నష్టం జరిగితే నష్ట పరిహారం చెల్లించాలి అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని , అధికారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం అయినది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The problems of Gopalamitra must be solved