ఆర్టీసీ కార్మికుల, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Date:17/10/2019

మందమర్రి ముచ్చట్లు:

ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మంచిర్యాల జిల్లా ఉద్యోగుల సంఘం మద్దతుగా ఉంటుందని తెలుపుతూ అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించి ఆర్టీసీ నాయకులతో అలాగే ప్రభుత్వ ఉద్యోగుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం స్థానిక ఐటిఐ ప్రాంగణంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చందర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఉద్యోగులు వారి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ బంగారు తెలంగాణ లో భాగస్వాములు అవుతున్న వారు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

 

 

 

 

 

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కారం కాకున్నా నవతెలంగాణ నిర్మాణానికై ఉద్యోగులు అధిక భారాన్ని మోస్తూ తమ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తుందని సంవత్సర కాలంగా సమస్యల పరిష్కారానికి జేఏసీ సంఘాలను పిలవకుండా ముఖ్యమంత్రి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఇప్పటికైనా జేఏసీ నాయకులను పిలిచి ఆర్టీసీ ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో  పలు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏ సాగర్, ఎల్ కృష్ణ, సునీల్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, జాయింట్ సెక్రెటరీ మధులత, శ్రావణ్ కుమార్, సోహిబ్, రాజేందర్, శ్రీకాంత్ ,సంపత్, తిరుమల, మురహరి, హేమలత, స్వరూప, తిరుపతి, శ్రీనివాస్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సబ్ సెంటర్ పై విచారణ చేపట్టిన మెడికల్ ఆఫీసర్

 

Tags: The problems of RTC workers and government employees should be addressed immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *