అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:


ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   “స్పందన”   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల  అధికారులను  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో..    ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన”  కార్యక్రమం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జాయింట్ కలెక్టర్  సాయికాంత్ వర్మ , ఇంఛార్జి డిఆర్వో, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, డ్వామ, డిఆర్డీఏ  పీడిలు యదుభూషన్ రెడ్డి,  పెద్దిరాజు,..లు  హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లా డుతూ….  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.   పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించా లన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో  సిపివో వెంకట రావు, ప్రొద్దుటూరు ఆర్టీవో వీర్రాజు, సమగ్ర శిక్ష పీడి   ప్రభాకర రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు, రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు,  ఎల్డిఎం దుర్గా ప్రసాద్, డీపీవో ప్రభాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్  ఎస్ ఈ శ్రీనివాస రెడ్డి, ఆర్ & బి ఎస్ ఈ  మహేశ్వర రెడ్డి, జడ్పి సీఈఓ సుధాకర్ రెడ్డి,  గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య, ఎస్ సి  కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బ్రహ్మయ్య,   జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు,  జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి,   అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The problems of the petitioners should be resolved-District Collector V.Vijay Ramaraju

Leave A Reply

Your email address will not be published.