Natyam ad

పుంగనూరులో గ్రామీణుల సమస్యలు తీరింది-ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారమై , ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి ఆయన మండలంలోని చెలిమిగడ్డ, కృష్ణాపురం, మంగళం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సహకారంతో మంగళం పంచాయతీలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. అలాగే సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు , రైతులకు ఇంటి వద్దనే సేవలు అందిస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు ఎరువులు, విత్తనాలు , యంత్రాలు ఆర్‌బికెలలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వనజమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, సురేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి ,రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: The problems of villagers in Punganur have been solved – MPP Bhaskar Reddy.

Post Midle