కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రక్రియ షురూ….

The process of congressional candidates is shoe

The process of congressional candidates is shoe

Date:15/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రక్రియ ప్రారంభం అయింది. డిసీసీల నుంచి వచ్చిన జాబితాను పీసీసీ పరిశీలించింది. పీసీసీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్ శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్ కమిటీ తుది అభ్యర్థుల జాబితాను రూపొందించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి అందిస్తుంది.
స్క్రీనింగ్ కమిటీ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తుంది. గెలుపు పై నమ్మకం లేకనే తెరాస హడావుడిగా ముందస్తు ఎన్నికలకు వచ్చి… అభ్యర్థులను ప్రకటించిందని అన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గెలిచేవారినే అభ్యర్థులుగా ప్రకటిస్తాం. తెరాస చేతుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి అసెంబ్లీ ని రద్దు చేసింది. అలాగే కాంగ్రెస్ లో ఓ పద్ధతి ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారమే కమిటీల ఏర్పాటు ఉంటుంది.
ఓటర్ల జాబితా, ఈవీఎంల సన్నద్ధత సహా అన్ని అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఎన్నికల నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసినం పార్టీ కాంగ్రెస్ అని ఆమె అన్నారు.
Tags:The process of congressional candidates is shoe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *