పాఠశాలల విలీన ప్రక్రియను ఆపాలి
కడప ముచ్చట్లు:
కార్పొరేషన్ పరిధిలోని చెమ్మియాపేట ప్రాథమిక పాఠశాలను శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెంవిజయభాస్కర్, కాంగ్రెస్ ఎన్.ఎస్.యు.ఐ నేతలు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమ స్యలు అడిగి తెలుసుకు న్నారు.విద్యార్థు లు తమ బడి తమకే ఉండాలంటూ మేము ఇక్కడే చదువుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 20 లక్షల రూపాయలు వ్యయంచేసి పాఠశాలను పునరుద్ధరించి నేడు 130 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల నుంచి నూరు మందిని మూడు, నాలుగు, ఐదు తరగతులకు సంబంధించిన విద్యార్థులను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తామని చెప్పడం సబబు కాదని అన్నారు. ఉన్నత పాఠశాలలో ఈ వంద మంది విద్యార్థులకు వసతులు, గదులు లేని పరిస్థితి నెలకొందన్నారు . రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయముతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందన్నారు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా వారిని అక్కడే ఉంచాలని, ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన జి.ఓ 117 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నేతలు చంద్రకాంత్, ప్రసాద్, ప్రభుదాస్, వర్ధన్ పాల్గొన్నారు.
Tags: The process of merger of schools should be stopped

