విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలి

–  భాజపా రాష్ట్ర కార్యాలయాన్నిముట్టడించిన  సీపీఐ
      – సీపీఐ నాయకులను అరెస్టు
విజయవాడ ముచ్చట్లు;
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులతో భాజపా నాయకులు వాగ్వాదానికి దిగారు. సీపీఐ డౌన్ డౌన్ అంటూ భాజపా నాయకుల నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరసన ఎక్కడైనా, ఎవరైనా శాంతియుతంగా చేసుకోవచ్చని.. తమ కార్యాలయం ముందు చేస్తే మాత్రం సహించమని భాజపా అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజు హెచ్చరించారు.
Tags:The promises of the division act should be implemented immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *