మానవుడు స్వేచ్ఛగా జీవించినపుడే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుంది

The protection of human rights is possible when man lives freely

The protection of human rights is possible when man lives freely

Date:10/12/2019

సోమల ముచ్చట్లు:

సమాజంలో మానవుడు స్వేచ్ఛగా జీవించి నపుడే మానవ హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధరం అన్నారు. మంగళవారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన రెవెన్యూ ఇస్పెక్టర్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ సమాజంలో కుల మతాలకు అతీతంగా మనుషులంతా సమానత్వం గా జీవించినప్పుడే మానవ హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. సమాజంలో మానవ హక్కులకు భంగం కలిగిందని కలిస్తే తక్షణమే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు అని ఆయన సూచించారు. శ్రీ అరవింద వెంకటేశ్వర హాస్పిటల్ తిరుపతి వారు విద్యార్థినీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి,దృష్టి లోపం ఉన్నవారికి ఉచితంగా
కళ్ళద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ కే. దుర్గారావు,లేబ్రేరియన్ డి.శ్రీనివాసులు,జి ఎల్ గిరిధర్,సత్యనారాయణ,గౌతమ్,శివయ్య,నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

 

అంతక్రియల్లో పాల్గోన్న మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం

 

Tags:Protection of rights is possible only when a human being is free to live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *