జూనియర్ డాక్టర్ల నిరసన

Date:16/03/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలులో 9 వ రోజు కూడా  జూనియర్ డాక్టర్లు వినూత్న నిరసన కొనసాగించారు. మెడికల్ కాలేజి ఎదుట చేతులను తాడు సాయంతో కట్టుకొని నిరసన ప్రదర్శించారు. ఎంబీబీఎస్, పీజీ  పూర్తి చేసినా వెంటనే రిజిస్ర్టేషన్ చేయకపోవడంపై జూడాలు ఆగ్రహం  వ్యక్తం చేసారు. పెంచిన జీతాలకు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పెండింగ్ అరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు.  ఇంటర్న్స్,  పీజీల  స్కాలర్ షిప్స్  పెంచాలని డిమాండ్ చేసారు.  రిజిస్ర్టేషన్ చేయకుండా తమ హక్కులు కాలరాస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే  అరియర్స్ చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు 9 రోజులుగా ఆందోళనబాట పట్టడం వల్ల ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం చలించకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. తమ ఆందోళనను ఉధృతం చేయడంతోపాటు.. అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు.
Tags: The protest of junior doctors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *