ఏలూరులో ప్రజా అవేదన సభ

The public discontent in Eluru

The public discontent in Eluru

Date:06/10/2018
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఆవేదన ధర్నా జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నుండి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పార్టీ  రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ, ఎంపీ లు జీవిల్.నరసింహారావు, గోకరాజు గంగరాజు, జాతీయ నాయకురాలు పురంధరేశ్వరి,  ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే మాణిక్యాలరావు, ఇతర రాష్ట్ర నేతలు పాల్గోన్నారు.
ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను అవినీతిమయం చేయడంలో నెంబర్ వనని ఆరోపించారు. టీడీపీ జన్మభూమి కమిటీల్లో, ప్రాజెక్టుల్లో, మరుగుదొడ్డులో కూడా అవినీతి పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు కు ఇందులో అనుభవం ఉందొ మాకు ఇప్పుడు అర్ధమైందని అన్నారు. అధర్మ చక్రవర్తిగా ఎలా ఉండాలో, అవినీతి ఎలా చేయాలో ఆయనకు అనుభవం ఉంది.
2019 లో రాష్ట్రంలో అవినీతికి అడ్రస్ లేకుండా చంద్రబాబు ను తరిమెసేలా బీజేపీ బాధ్యత తీసుకుంటుంది. ప్రతీ నియోజకవర్గానికి అవినీతి రాజుగా టీడీపీ ఎమ్మెల్యేలు మారారు.  ఎమ్మెల్యేల నుండి కార్యకర్తల వరకూ అవినీతి చేయండంటూ ఆదేశాలిచ్చిన అవినీతి చక్రవర్తి చంద్రబాబని అన్నారు. ఇలాంటి అవినీతి ని చూడలేని బీజేపీ వారిపై పోరాటం చేస్తూ, ప్రజల ఆవేదనను ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు.
Tags:The public discontent in Eluru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *