The pure crown of Punganur

పుంగనూరుకు స్వచ్చ కిరీటం

– రాష్ట్రంలో ప్రథమస్థానం -1
– మంత్రి పెద్దిరెడ్డి సాకారంతో

Date:22/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం , ప్రభుత్వాధికారయంత్రాంగం కృషి ఫలితంగా పుంగనూరుకు స్వచ్చకిరీటం దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశద్ధ్య మెరుగుచర్యలలో రాష్ట్రంలో ప్రథమస్థానం దక్కించుకుని, గుర్తింపు సాధించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి డీఎంఏ విజయకుమార్‌ ఉత్తర్వులు పంపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటిలు పుంగనూరు మున్సిపాలిటిని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని ఆయన ఆదేశించారు.

మాసోత్సవాలు…

రాష్ట్రంలోని 59 మున్సిపాలిటిలలోని పాఠశాలల్లో గత ఏడాది నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు పారిశుద్ధ్య మాసోత్సవాలను నిర్వహించి, అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఈకార్యక్రమాలను కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, కార్మికులు అమలు జరిపారు. ఇందులో బాగంగా పాఠశాలల పైకప్పు ప్రాంతాలలో చెత్తను శుభ్రం చే శారు. ఆవరణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మంచినీటి కొళాయిలను , ట్యాంకులను శుభ్రం చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టి, మరుగుదొడ్లను వినియోగించుకున్నారు. అలాగే విద్యార్థులే వాటిని శుభ్రం చేసుకుంటు ఆదర్శంగా నిలిచారు. వీటితో పాటు పాఠశాలల్లో చెత్తను ఎప్పటికప్పుడు తడిచెత్త, పొడిచెత్తగా వేరుచేసి , హ్గంకంపోస్ట్ విధానాన్ని ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు. అలాగే పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు విద్యార్థులు తమ తల్లిదండ్రుల ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టి, పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో వెహోక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకునేందుకు యోగా, కరాటే కార్యక్రమాలలో శిక్షణ పొందుతున్నారు.

పరిశీలన….

మున్సిపాలిటి పరిధిలోని పాఠశాలల్లో చేపడుతున్న కార్యక్రమాలను సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా సచివాలయంలోని కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌కు పంపేవారు. ఈ వివరాలను సేకరించిన సచివాలయ అధికారులు ప్రత్యక్ష వీడియో వీక్షణ ద్వారా పరిశీలన చేశారు. ఈ క్రమంలో పుంగనూరు అగ్రస్థానంలోకి వచ్చేందుకు సుగమం చేసుకున్నారు.

గతంలో రికార్డులు….

పుంగనూరు మున్సిపాలిటి అన్ని రంగాల్లో సమర్తవంతంగా పని చేయడంతో రాష్ట్రంలోని మున్సిపాలిటిల పనితీరును ప్రభుత్వం ఆరు నెలలకొక్కసారి పరిశీలించి, గ్రేడులు నిర్ణయిస్తుంది. ఇందులో బాగంగా గత మూడు సంవత్సరాలుగా మున్సిపాలిటికి రెండు సార్లు నెంబర్‌ వన్‌ స్థానం దక్కింది. అలాగే గత ఏడాది రాష్ట్ర స్థాయి గ్రేడింగ్‌లో మూడవ సారి కూడ నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటీతో పాటు మున్సిపాలిటిలో 25 వేల వెహోక్కలు నాటి , వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి, సంరక్షించినందుకు మున్సిపాలిటికి రాష్ట్రస్థాయిలో గ్రీనరీ రికార్డు లభించింది.

మున్సిపాలిటి అమలు చేస్తున్న పథకాలు….

మున్సిపాలిటిలో పన్నుల వసూళ్ళు, వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం సిటిజన్‌ ఛార్టర్‌ అమలు, పురసేవ , వీధి దీపాలు , ఇంటింటా చెత్త సేకరణ, నీటి సరఫరా , ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం, పన్నుల క్రమబద్దీకరణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధంతో పాటు 17 రకాల సేవలను అందిస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాల క్రమబద్దీకరణ , సిటిజన్‌ చార్టర్‌ అమలు, డ్వాక్రా రుణాల పంపిణీ, వెహోక్కల పెంపకం, ఐఐటి కోర్సుల అమలు, ఆడిట్‌, పుస్తకాల నిర్వహణ, వృత్తిపనివారులకు శిక్షణ, స్పందన సమస్యల స్వీకరణ, పరిష్కారం లాంటి కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు.

పారదర్శకంగా, వేగవంతంగా….

పుంగనూరు మున్సిపాలిటిని నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా సూచనల మేరకు అభివృద్ధి చేపట్టాం. మున్సిపల్‌ ప్రజలకు పారదర్శకంగా, వేగంవంతంగా సేవలు అందిస్తున్నాం. సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నాం. మున్సిపాలిటిని అగ్రస్థానంలో నిలిపేందుకు ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలు చేస్తున్న కృషి, సహకారం మరువలేనిది.

– కెఎల్‌.వర్మ. మున్సిపల్‌ కమిషనర్‌, పుంగనూరు.

ప్రజాస్వామ్యంలో మతాల మధ్య చిచ్చుపెడుతారా..?

Tags: The pure crown of Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *