ఐ ప్యాక్ కోసం క్యూ కడుతున్నారే…

Date:05/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రశాంత్ కిషోర్… ఎన్నికల వ్యూహకర్త. లోక్ సభ ఎన్నికలను పక్కన పెడితే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ కోసం క్యూ కడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఒప్పందం కోసం పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. కోట్లాది రూపాయలకు ప్రశాంత్ కిషోర్ కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీలు ప్రశాంత్ కిషోర్ సేవల కోసం వేచి చూస్తున్నాయి.ప్రశాంత్ కిషోర్.

 

 

 

ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమే. 2014లో మోదీకి, ఆ తర్వాత బీహార్ లో నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి వారిని విజయపథాన నిలిపారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉండి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. అనుభవమున్న చంద్రబాబును ఏపీలో ఓడించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ పార్టీల్లో డిమాండ్ పెరిగింది.ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆయన సంస్థ ఐప్యాక్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో తమ పనులను ప్రారంభించింది.

 

 

 

ఇక మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కూడా ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. తన కుమారుడు ఆధిత్య థాక్రే రాజకీయ భవిష్యత్తుపైనా, త్వరలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన సేవలు అందించడంపైనా చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. అయితే ప్రశాంత్ కిషోర్ దీనిని ఖండించారు.తాజాగా తమిళనాడులో కూడా ప్రశాంత్ కిషోర్ ఫీవర్ పట్టుకుంది. తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 

 

 

ఇప్పటికే కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. కానీ అధికార అన్నాడీఎంకే కూడా పీకేతో డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ తమకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తారని అన్నాడీఎంకే అగ్రనేతలు చెబుతున్నారు. మొత్తం మీద పొలిటికల్ సర్కిళ్లలో ప్రశాంత్ కిషోర్ డిమాండ్ అమాంతంగా పెరిగింది.

మోడీకి సౌత్ సవాలే 

Tags: The queue for the i pack …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *