Benefit of crorepatis by Ayushman Bharat: Prime Minister Modi

ప్రధాని ఆదేశాలతో రైల్వే శాఖ కీలక ప్రకటన 

Date:10/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు నడుపుతున్న రైళ్ల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని ఆదేశానుసారం రోజుకు 300 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలు వలస కార్మికుల తరలింపునకు సహకరించాలని ఆయన కోరారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు తరలించనున్నట్లు పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గత ఆరు రోజులుగా శ్రామిక్ రైళ్లు వలస కార్మికులను తరలిస్తున్నాయి.

 

 

అయితే.. ఆయా రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు పరిమిత సంఖ్యలో రైళ్లకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇప్పుడు స్వయంగా కేంద్రమే చొరవ తీసుకుని వలస కార్మికులను పూర్తి స్థాయిలో.. అదీ మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో తరలించాలని నిర్ణయించడంతో లాక్‌డౌన్ పొడిగింపు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్రం విధించిన లాక్‌డౌన్ ముగిసేందుకు ఇంకా సరిగ్గా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈలోపు.. దేశంలోని వలస కార్మికులను, విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పరిణామాలను గమనిస్తే.. మే నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గుచూపుతుందనే వాదన తెరపైకొచ్చింది.

హైదరాబాద్ ఐటీ కంపెనీలు ప్రారంభం, కండిషన్స్ అప్లై! కంపెనీ-ఉద్యోగులు పాటించాల్సిన రూల్స్..

Tags: The Railway Department is a key statement with Prime Minister’s orders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *