తల్లిపిల్లలనుకాపాడిన రైల్వే కీ మాన్
కాకినాడ ముచ్చట్లు :
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే గేటు వద్ద తల్లి ఇద్దరు పిల్లలను రైల్వే కీమాన్ కాపాడాడు. విశాఖపట్నం-విజయవాడ సూపర్ పాస్ట్ రైలు వస్తున్న ట్రాక్ పై తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకునేందుకు ఎదురుగా వెళ్లారు. ట్రైన్ క్రింద పడి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య కు యత్నించిన మహిళను గమనించిన రైల్వే కీమాన్ పిడిమి వెంకటేశ్వరావు, పరుగున వెళ్ళి తల్లి పిల్లలను ప్రక్కకు లాగి వారిని రక్షించాడు. తరువాత 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పిఠాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లీపిల్లలను తీసుకుని కాకినాడ దిశా పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. వారికి పోలీసులు కాకినాడ దిశ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి, ధైర్యం చెప్పి పుట్టింటి వారికి అప్పగించారు. బాధితురాలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒక గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. భర్తతో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించింది. తల్లి ఇద్దరు పిల్లల్ని కాపాడిన రైల్వే కీమాన్ పిడిమి వెంకటేశ్వరావుని పోలీసులు,స్థానికులు అభినందించారు.
Tags; The railway key man who saved the mother’s children

