మెదక్ జిల్లాలో రైతులను నిండా ముంచిన వర్షం
మెదక్ ముచ్చట్లు:
భారీ వర్సాలు మెదక్ రైతులను నిండా ముంచాయి. గత మూడు రోజులుగా జిల్లాలో వాన దంచి కొడుతోంది. శుక్రవారం మద్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు చోట్ల కురిసిన వర్షాలకు వరి పంట నేలకోరిగాయి. కొన్ని చోట్ల రోడ్లపై ధాన్యం తడిచిపోయింది. అన్నదాతలు అందోళనలోవున్నారు.మరోవైపు, ఏడు పాయల ఆలయం జల దిగ్బంధంలో వుండిపోయింది. అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించింది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తోంది. ఆర్చకులు ఆలయాన్ని మూసేసి…రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.
Tags: The rain inundated the farmers in Medak district

