-విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డా. వెంకటరాజి రెడ్డి
Date:15/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణ జాగరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకట రాజి రెడ్డి పిలుపునిచ్చారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ జాగరణ ఉద్యమ కరపత్రాలు, స్టిక్కర్లను జిల్లా కేంద్రంలోనిశ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్యలో రామజన్మభూమి స్థలంలో మందిర నిర్మాణం కోసం అనేక పోరాటాలు జరిగాయని, ఎంతో మంది రామ భక్తులు బలిదానం అయ్యారన్నారని అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం హిందువుల స్వాభిమాన ప్రతీకగా నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సరం ఆగస్టు 5న భూమిపూజ చేశారని అన్నారు. మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క హిందువు భాగస్వామ్యం అయ్యేవిధంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జన జాగరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈనెల 20 నుండి రామభక్తులు భారతదేశంలోని ప్రతి హిందువు తలుపు తట్టి మందిర నిర్మాణ మహాయజ్ఞంలో పాలు పంచుకునేలా చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి మందిర నిర్మాణ విశేషాలతో కూడిన కరపత్రాలను అందించి విరాళాలు సేకరిస్తారని తెలిపారు. తమ ఇళ్లకు వచ్చే రామ భక్తులను ప్రతి ఒక్కరు ఆహ్వానించి తమకు తోచిన విధంగా మందిర నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్మాణ జాగరణ కమిటీ సభ్యులు ఏన్నమనేని అశోక్ రావు, సాయి మధుకర్, భోగ శ్రీనివాస్, కౌన్సిలర్ గుర్రం రాము, వి. రాజశేఖర్, సిరిసిల్ల శ్రీనివాస్, మ్యాన మహేష్,కట్ట విజయ్, మహిపాల్ రెడ్డి, సంతోష్ శర్మ, లక్ష్మీ నరసయ్య, ఓల్లాల గంగాధర్, సంతోష్, అరుణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి
Tags:The Ram Mandir construction vigil movement in Ayodhya should be successful