రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

– జిల్లా కలెక్టర్ కృష్ణ బాస్కర్

 

Date:18/05/2019

సిద్ధిపేట ముచ్చట్లు:

రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం జరిపారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ తో కలిసి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రంజాన్ పండుగను శాంతి, సామరస్యాలతో ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకునేందుకు కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా అన్ని మతాల పండుగలను, ఇతర మతాల వారు గౌరవించి., ప్రతి పండుగను సోదరభావంతో జరుపుకోవడం అనవాయితీగా వస్తుందన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నిర్వహించే ప్రార్థనల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పలువురు మత పెద్దలు కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి మౌళిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వీటిపై స్పందించిన కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాలలో పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులు ప్రతి మసీదు,

 

 

 

 

 

 

 

ఈద్గా వంటి ప్రార్థన స్థలాలు, పబ్లిక్ ప్రాంతాలలో తాగునీటి వసతి, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా జిల్లాలోని 4 నియోజకవర్గాలకు 7వేల గిఫ్ట్ ప్యాకెట్లను అందిస్తున్నట్లు, సిద్ధిపేట 2వేలు, గజ్వేల్ 2500, దుబ్బాక 1500, హుస్నాబాద్ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఇవ్వనున్నామని, జిల్లాకు మరో 3500 గిఫ్ట్ ప్యాకెట్లు అదనంగా కావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వాటిలో సిద్ధిపేట నియోజకవర్గం 1500, గజ్వేల్ 1000, దుబ్బాక 500, హుస్నాబాద్ నియోజకవర్గానికి 500 చొప్పున ఉన్నట్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ తెలిపారు. అలాగే ఇఫ్తార్ విందు కోసం జిల్లాకు రూ.14లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో నియోజకవర్గాల వారీగా సిద్ధిపేటకు రూ.4లక్షల రూపాయలు, గజ్వేల్ రూ.5లక్షల రూపాయలు, దుబ్బాకకు రూ.3లక్షల రూపాయలు, హుస్నాబాద్ నియోజకవర్గానికి రూ.2లక్షల రూపాయల చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా త్వరలోనే విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాలలో జిల్లా పంచాయతీ అధికారి ద్వారా పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రంజాన్ పండుగ రోజున మసీదు ప్రాంగణంలో షామియానాలు తదితర ఏర్పాట్ల నిర్వహణ పై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, రేషన్ షాపుల ద్వారా అందించే నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా చూడాలని సంబంధింత శాఖా అధికారులకు జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ సూచించారు.

 

 

 

 

 

 

 

రంజాన్ పండుగ పురస్కరించుకుని పటిష్టమైన భద్రత చర్యలు

– సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్

ముస్లిం సోదరీ సోదరులకు పవిత్రమైన మాసం రంజాన్ మాసం అని మసీదు వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నట్లు సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ తెలిపారు. ప్రార్థనలు చేసే నమాజ్  టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రార్థన సమయంలో ట్రాఫిక్ మసీదుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని ముస్లిం సోదరులకు తెలియజేశారు. ప్రజలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ చేపట్టాల్సిన చర్యలు తీసుకోవడంలో నిరంతరం కృషి చేస్తుందని సీపీ జోయల్ డేవీస్ పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చిన స్పష్టంగా మత పెద్దలు తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. రంజాన్ మాసంలో చిన్న నుంచి పెద్దల వరకు దైవ నామస్మరణలో ఉంటారని, నెల రోజుల పాటు జరిగే ఈ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ పరంగా చేపట్టాల్సిన విధులు నిర్వర్తించడంతో పాటు పోలీసు శాఖకు సహకరించాలని సీపీ కోరారు. అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ తంజీమ్ మత పెద్దలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి జీవ రత్నం, అడిషనల్ డీసీపీ నరసింహ్మా రెడ్డి, ఏసీపీ రామేశ్వర్, తంజీమ్ ప్రతినిధి గౌస్ మోహినోద్దిన్, వివిధ మతాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

 కేదార్‌నాథ్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు.. గుహలో ధ్యానం

Tags: The Ramzan festival should be celebrated peacefully

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *