Natyam ad

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా సమస్యల పరిష్కరానికై కలసి కట్టుగా కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

-అంతా ఒక్కటై కలిసి కదిలిన కాంగ్రెస్ నాయకులతో ఆకర్షించిన  ర్యాలీ
-కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతిపత్రం

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

Post Midle

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజా సమస్యల పరిష్కరానికై జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా కదిలాయి. రైల్వేస్టేషన్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు   సుమారు అయిదు వందల మంది ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమములో భద్రాచలం ఎమ్మెల్యే, డి సి సిఅధ్యక్షులు పొదెంవీరయ్య, టిపి సిసి సభ్యులు ఎడవల్లి కృష్ణ, నాగా సీతారాములు పోట్ల నాగేశ్వరరావు మహిళా కాంగ్రెస్ నేత తోట దేవి ప్రసన్న తదితరులు మాట్లాడుతూ
ధరణి పోర్టర్ లో అవకతవకలు తొలగించాలని,
రైతుల రుణమాఫీ వెంటనే చేయాలని,
రైతులకు భీమా, రైతు బందును అందేలా చేయాలని,
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలని,
రైతుల పొడుభూమి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయమైజె.సి వెంకటేశ్వర్లు కి వివరించారు. కేసీఆర్ మాటలు కేవలం  నీటిమీద గీతల మాదిరి తప్ప ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు.రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేక మట్టిలో కలిసిపోయిందన్నారు.

 

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కొనాలని,కొనే వరకు తాము ముందుండి కోనేలా చేస్తామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయవచ్చని, అందుకు ప్రత్యేక నిధులు ఖర్చుచేయాల్సిన అవసరం లేదని,రూ.10వేల కోట్లతో రైతుల పంటను కొనొచ్చని,అందుకోసం రూ.2.5 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుండి కాస్త నిధులు  కేటాయిస్తే సరిపోతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి పంటని కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులతో కలిసి కెసిఆర్ ఫామ్ హౌస్ ని ముట్టడిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని,రైతు భీమా పథకం పెట్టారు కానీ అసలు అమలు చేస్తున్నారా చెప్పాలని చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వారు ఆసరాగా ఉపయోగ పడతాయని బీమా డబ్బుల కోసం ఎదురు చేసి చూసి  కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప పథకం అమలు చేయడం లేదన్నారు. ధరణి వల్ల  పేదరైతుకు లాభం కన్న నష్టమే ఎక్కువగా జరుగుతుందని, తప్పుల తడక రికార్డులు నమోదు, అధికారుల తప్పిదాలతో  నేటికి అఫీసుల చుట్టూ తీరుగుతున్నారన్నారు.పైగా అధికారులు చేసిన తప్పులను ధరణిలో సరిదిద్దుకొవటానికి వెయ్యి రూపాయలు చెల్లించమనడం అన్యాయం అని,లక్షల మంది రైతులు భూ రికార్డుల సవరణలో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 

 

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డి పోడు రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని,రైతులకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని, రాబోవు రోజుల్లో రాష్టంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యదిక మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు,కొత్తగూడెం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, లక్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరరావు,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్, రాములు నాయక్,చండ్రుగొండ బెండల పాడు ఎంపీటీసీ సురేష్, గోపి,బట్ట విజయ్ గాంధీ, జెబి సౌరి,కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు,పసుపులేటి వీరబాబు,కిసాన్ సెల్ ఏలూరి కొటేశ్వరవు, ఐ ఎన్ టి యు సి నాయకులు జెలీల్,త్యాగరాజు, డాక్టర్ శంకర్ నాయక్,ఆల్బర్ట్,కాలం నాగభూషణం,దళ్ సింగ్ నాయక్, దానియేల్,వీరయ్యచౌదరి, రాములు నాయక్,కేశవ్,సీతారాములు,కళ్లెపల్లి రాజు,శనగ లక్ష్మణ్,విరపురం రామలక్ష్మన్,సునీల్,కరీం పాషా,పురిటి నరేష్,వాలి,చంద్రకళ,నాగమణి,కృష్ణవేణి, భద్రాద్రి జిల్లా అయిదు నియోజకవర్గాల పట్టణ,మండల అధ్యక్షులు,నాయకులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: The ranks of the Congress have come together to solve the public problems against the anti-government policies

Post Midle