హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ కై రథయాత్ర

Date:02/12/2019

బేతంచర్ల  ముచ్చట్లు:

హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ కై  కంచి పీఠాధిపతి శిష్య బృందం సోమవారం నాడు బేతంచెర్ల మండలం లోని వివిధ దేవాలయాలను సందర్శించారు.  ఈ సందర్భంగా ఇవి సుజాత శర్మ గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా శంకర విజయేంద్ర స్వామీజీ మాట్లాడుతూ కర్నూలు నుండి 11 మంది తమ శిష్య బృందంతో హిందూ దేవాలయాలను సందర్శిస్తున్న మని సోమయాజుల పల్లె సత్రం లోని దేవాలయాలను, సిమెంట్ నగర్ లోని శివాలయాన్ని,  బేతంచర్ల లోని దేవాలయాలను అదేవిధంగా గొర్ల గుట్ట లోని దేవాలయాలను అదేవిధంగా బనగానపల్లె మీదుగా తమ యాత్ర సాగిస్తామని ఇది సమాజ శ్రేయస్సు కోసం హిందూ సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ఈ రథయాత్ర కార్యక్రమాన్ని హిందు ఆచారవ్యవహారాలను వివరిస్తూ ఈ రథయాత్ర కొనసాగుతుందని వారు సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తికి చెందిన చంద్రశేఖర శర్మ, పాణ్యం సిమెంట్స్  కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల శర్మ, పారిశ్రామిక వేత్తలు బుగ్గన శ్రీధర్ రెడ్డి,  గుండా గోపాల్, చంద్రమౌళీశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే కొనుగోళ్లు

 

Tags: The Rath Yatra of Hindu Temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *