రామసముద్రం లో వాళీశ్వరస్యామి పాదాలు తాకిన సూర్య కిరణాలు

రామసముద్రం

రామసముద్రంలో వెలసిన శ్రీ వాళీశ్వరస్యామి పాదాలను శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. విషయం తెలుసుకున్న వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కులశేఖర్ బట్టర్, తిన్నిలిస్వామిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది భాద్రపద మాసం కృష్ణ పక్షంలో మూడు రోజుల పాటు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు జరిపించారు. ఆలయ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.

 

Tags: The rays of the sun touched the feet of Valiswarasyami in Ramasamudra

Leave A Reply

Your email address will not be published.