రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయడమే జయశంకర్‌కు నిజమైన నివాళి: సీఎంకెసిఆర్

హైదరాబాద్‌ ముచ్చట్లు:

తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనను స్మరించుకున్నారు. జయశంకర్ సార్‌ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీపడుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే జయశంకర్‌కు నిజమైన నివాళి అని సీఎం తెలిపారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:The real tribute to Jayashankar is to develop the state: CMKCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *