Natyam ad

దేశ సంఘటితానికే భారత్ జోడో యాత్ర-జోడో యాత్రకు ఆదరణ అద్భుతం

-చివరి వరకు రాహుల్ యాత్రలో ఉంటా

-టిటిసిసి సభ్యులు నాగా. సీతారాములు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

Post Midle

దేశ ప్రజలను ఏకం చేసి ప్రభుత్వాల వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపట్టారని కొత్తగూడెం నియోజకవర్గం నాగా. సీతారాములు తెలిపారు.భారత్‌ జోడోయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు సంఘీభావంగా మక్తల్‌ దగ్గర కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి రాహుల్‌ ప్రవేశించిన నాటి నుండి ఆయనతో పాటు  పాదయాత్రలో కలిసి అడుగులు  చేస్తున్నట్లు సీతారములు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రాజాస్వామిక విధానాలపై గళమెత్తుతూ కాంగ్రెస్‌ తరపున ప్రజలను మమేకం చేసేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశంలో మతతత్వ శక్తులను బీజేపీ ప్రేరేపిస్తూ మత కలహాలు సృష్టిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర ప్రారంభమైన నాటి నుండి ఆయన వెంటే ఉన్నానని మహారాష్ట్రలోకి  ప్రవేశించే వరకు ఆయన వెంట నడవనున్నట్టు ఈ సందర్బంగా నాగా సీతారాములు తెలిపారు.

 

Tags: The reception of Bharat Jodo Yatra-Jodo Yatra is amazing for the unity of the country

Post Midle

Leave A Reply

Your email address will not be published.