The refrain is very costly

పల్లవి చాలా కాస్ట్ లీ

Date:18/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

నేచురల్ నానితో తాజా సినిమా ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.అద్భుత నటనతో, డ్యాన్సులతో దక్షిణాది సినీ తెరపై తిరుగులేని గుర్తింపు తెచ్చుకంది సాయిపల్లవి. ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే ఈ అమ్మడు తన టాలెంట్‌నే నమ్ముకుని దూసుకుపోతోంది. ‘ఫిదా’తో అందరినీ ఫిదా చేసిన సాయిపల్లవికి ఆ తర్వాత వరుస అవకాశాలు చుట్టుముట్టినా తొందరపడలేదు. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే కనిపిస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది.ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగచైతన్య పక్కన ‘లవ్‌స్టోరీ’లో నటిస్తోంది సాయిపల్లవి. తాజాగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా సాయిపల్లవిని మెయిన్ హీరోయిన్‌‌గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని తీసుకోనున్నట్లు సమాచారం. సాయిపల్లవి గతంలో ‘ఎంసీఏ’ సినిమాలో నాని పక్కన నటించింది.

 

బాలిక అదృశ్యం… విషాదాంతం

Tags:The refrain is very costly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *