Natyam ad

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా “ప్రేమకథ” సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఎవడు మనోడు..’ రిలీజ్

హైద్రాబాద్ ముచ్చట్లు:

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ప్రేమకథ”. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు. “ప్రేమకథ” సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఎవడు మనోడు…’ను హీరో ఆనంద్ దేవరకొండ రిలీజ్ చేశారు. పాట వినగానే ఆకట్టుకుందని, ఈ సాంగ్ ఛాట్ బస్టర్ కావాలని తన బెస్ట్ విశెస్ అందించారు ఆనంద్ దేవరకొండ.
‘ఎవడు మనోడు…’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కంపోజ్ చేయగా..రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సీవీ సంతోష్ పాడారు. ‘ఎవడు మనోడు, ఎవడు పగోడు ..కాలం ఆడుతుంది చూడు వింత చెడుగుడు. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు..కత్తి దూస్తు ఉంది చూడు పంతమిప్పుడు..’ అంటూ అగ్రిసెవ్ కంపోజిషన్ తో…రివేంజ్ మోడ్ లో  సాగుతూ ఆకట్టుకుంటోందీ పాట.వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు శివశక్తి రెడ్ డీ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న “ప్రేమకథ” చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
నటీనటులు – కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు.

 

Tags: The release of the first lyrical song ‘Evadu Manodu..’ from the movie “Premakatha” by hero Anand Devarakonda.

Post Midle