Natyam ad

పూర్తికావస్తున్న కాణిపాకం ఆలయ పునర్నిర్మాణ పనులు

కాణీపాకం ముచ్చట్లు:


వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సత్య ప్రమాణాలకు నెలవైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి ఈ నెలాఖరులోగా పునర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ఆగస్టు 21న జరిగే ఆలయ మహా కుంభాభిషేకానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు.  కాణిపాకం ఆలయంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు పది కోట్ల రూపాయల అంచనాలతో ప్రవాస భారతీయుడైన విజయవాడకు చెందిన రవి అనే దాత సహకారంతో తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఉన్న శిల్ప సంపద ఉట్టిపడే విధంగా కాణిపాకం ఆలయ పునర్నిర్మాణం పనులు సాగిస్తున్నారు.  ఈ పనులను నిర్దేశించిన గడువు కన్నా ముందుగానే పూర్తి చేస్తున్నారు సుమారు రెండు వేల సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా ఉండే విధంగా ఇంజనీరింగ్ అధికారులు ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తున్నారు.

 

సుమారు 2000 టన్నుల కృష్ణ షీలా గ్రానైట్ రాయితో మన శాస్త్ర ప్రకారం ఆలయ పునర్నిర్మాణ పనులు సాగిస్తున్నారు.  ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గతంలో కన్నా విశాలంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా నాలుగు ద్వారాలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఆధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆలయ నిర్మాణంలో శరవేగంగా సాగుతున్నాయి ప్రధాన ఆలయ పనులు విమాన గోపురం దాదాపు పూర్తి కావడంతో ఆలయ నిర్మాణం నూతన ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.  ఇదిలా ఉండగా గతంలో ఉన్న బంగారు స్థానంలో నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు సుమారు 56 అడుగుల నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి ఆగస్టు 4న ధ్వజస్తంభ ప్రతిష్ఠ గావించ ఉన్నారు… అలాగే 21న నూతన ఆలయ మహా కుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

 

Post Midle

Tags: The renovation works of Kanipakam temple are being completed

Post Midle