The response program should be performed as a duty

స్పందన కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలి

– కమిషనర్‌ వర్మ

Date:16/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలోని సచివాలయాలలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయా వార్డుల సచివాలయాలకు వెళ్లాలన్నారు. సచివాలయంలోని అన్నిశాఖల ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను విని, అర్జీలను స్వీకరించాలన్నారు. ఉద్యోగులు గైర్హాజరైనా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పందన కార్యక్రమాన్ని అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి, ప్రజలకు రశీదులు ఇచ్చి పంపాలన్నారు. వినతిపత్రాల జాబితాలను తయారు చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత అధికారులకు పంపాలన్నారు. ప్రజలెవ్వరు మున్సిపల్‌ కార్యాలయంలోని స్పందన కార్యక్రమానికి రాకుండ చూడాలని , సచివాలయంలోనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అవినీతికి కేరాప్‌ చంద్రబాబు

Tags: The response program should be performed as a duty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *