మూడు నెలల పాటు ఐటీ కారిడార్ లో ఆంక్షలుట్రాఫికర్…

Date:13/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మెట్రో పనుల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు 3 నెలల పాటు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. హైటెక్‌ సిటీ జంక్షన్‌ నుంచి మైండ్‌స్పేస్‌ జంక్షన్‌  వరకు మెట్రో స్టేషన్‌, ఇతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పలు రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ నిబంధనలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. హైటెక్‌ సిటీ జంక్షన్‌ నుంచి సైబర్‌ గేట్‌ వే వరకు ఓ వైపు రోడ్డును పూర్తిగా మూసేశారు. హైటెక్‌ సిటీ జంక్షన్‌ నుంచి మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలకు వన్‌ వేగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి హైటెక్‌ సిటీ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలు లెమన్‌ ట్రీ హోటల్‌ వద్ద లేదా సైబర్‌ గేట్‌ వే వద్ద నుంచి ఎడమవైపు వెళ్లాల్సి ఉంది. వాహనదారులు టెక్‌ మహీంద్ర, ఒరాకిల్‌ మీదుగా సీఐఐ జంక్షన్‌ వద్ద కుడివైపు టర్న్ తీసుకుని హైటెక్స్‌, శిల్పారామం మీదుగా హైటెక్‌ సిటీ జంక్షన్‌ సైబర్‌ టవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని, ఐటీ ఉద్యోగులు,
వాహనదారులు సహకరించాలని ఉత్తర్వుల్లో కోరారు. హైటెక్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తొలి రోజే ఐటీ కారిడార్‌లో పనిచేసే, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి చౌరస్తాలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఓఆర్‌ఆర్‌ టోల్‌ ప్లాజా నుంచి వాహనాలు గంటల తరబడి ముందుకు కదలలేదు.
లింగంపల్లి – టోలిచౌకీ, హైటెక్‌ సిటీ – గచ్చిబౌలి రూట్లలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు నరకం అనుభవించారు. నిబంధనల గురించి అవగాహన లేక చాలా మంది తీవ్ర ఇబ్బందులుపడ్డారు. తొలి రోజే పరిస్థితి ఇలా ఉంటే.. 3 నెలల పాటు ఎలా భరించాలోనని పలువురు ఆందోళన వ్యక్తపరిచారు.
Tags; The restrictions on the IT corridor for three months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *