యువత కు ఓటు హక్కు కల్పించింది..రాజీవ్ గాంధే

-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆది

Date:21/05/2019

వేములవాడ  ముచ్చట్లు:

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు 18ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించి దిశా నిర్దేశం చూపిన  మహానేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు  వేములవాడ మండలం వట్టెముల మరియు తిప్పపూర్ గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజీవ్ గాంధి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పైలట్ నుంచి దేశ ప్రధాని గా ఎదిగిన రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చీర స్థాయి గా నిలిచి పోయారని, యువతకు 18 ఏళ్ల వయస్సులో యువతకు ఓటు హక్కును కల్పించి యువతను రాజకీయాల్లో చురుగ్గా పాలుగోనేలా చేసిన సంస్కరణ కర్త అని అన్నారు.

 

 

 

 

ఐటీ రంగం లో విప్లవ మార్పులను తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలన దక్షులు, జాతీయ విద్య, విధానం అమలు చేసి అక్షరాస్యత దిశగా దేశాన్నీ ముందుకు నడిపిన మహా నాయకుడని తెలిపారు. 1985 సం. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చి, దేశంలో బికారి హఠావో అనే నినాదం కు..తెర లేపిన మహా నేత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, అర్బన్ మండలాధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ఎర్రంనాయుడు రాజు, బిసి సెల్ ఉపాధ్యక్షుడు చిలక రమేష్, నాయకులు మారం చిరంజీవి, చంద్రగిరి శ్రీనివాస్, పాత సత్యలక్ష్మి, రవీందర్, సంగేస్వామి యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పరిషత్ కౌంటింగ్ పై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు

 

Tags: The right to vote for youth is Rajiv Gandhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *