ఓటు హక్కు విలువైనది
నర్సాపురం ముచ్చట్లు:
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువైనదని నర్సాపురం సబ్ కలెక్టర్ సూర్య తేజ అన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భం గా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పట్ట ణం విధుల్లో భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సూర్య తేజ మాట్లాడుతూ 18 ఏళ్ల నిండిన పౌరులకు ఓటు హక్కు కల్పిం చడంలో భారతదేశం మొదటి స్థానం లో ఉందన్నారు. పౌరులందరూ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకుని ఓటు హక్కును వినియోగించుకోవా లని కోరారు. ఈ ర్యాలీలో పట్టణంలోని ఆయా కళాశాలకు చెందిన విద్యార్థు లు భారీగా పాల్గొన్నారు. అనంతరం నరసాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు.
Tags; The right to vote is valuable

