The risk of a corona pandemic is still looming.

కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా పొంచి ఉంది.

Date:21/10/2020

సత్యవేడు ముచ్చట్లు :

కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా పొంచి ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా సత్యవేడు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి స్పష్టం చేశాడు. బుధవారం సత్యవేడు పంచాయతీ ఇంచార్జ్ సెక్రెటరీ శైలేంద్రకుమార్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఆరు నెలల పాటు కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది అన్నారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందిన మరణాల రేటు తక్కువే అన్నారు.కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడే కట్టడి చేయడంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడింది అన్నారు. దీంతోపాటు కోవిడ్ కేంద్రాల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడం జరిగిందన్నారు.

 

 

అయితే ప్రజలు కూడా దీనిపై అవగాహన పెంచుకుని వ్యక్తిగత స్వీయ రక్షణ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జన రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు వినియోగించడం తోపాటు శానిటైజర్ చేసుకోవాలన్నారు.అలాగే భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారి బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకొని హోమ్ క్వారంటైన్లో వైద్యుల సూచన మేరకు ఉండాలని ఆయన కోరారు. దీనిపై వైద్య సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ పరిస్థితులను ఆరా తీయాలి అన్నారు. కరోనా వైరస్కు టీకాలు రావడానికి ఇంకా నాలుగైదు నెలలు పట్టే అవకాశం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై ప్రయోగాలు వివిధ స్థాయిలో ఉన్నట్టు అని స్పష్టం చేశారు.టీకాలు వచ్చేంతవరకు కరోనా మహమ్మారి బారిన పడకుండా స్వీయ రక్షణ తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, సోమశేఖర్, రమేష్, టెంకాయల కృష్ణయ్య,విఆర్ఓ ఇళయరాజగ్రామసచివాలయ అధికారులు సునీల్, గోపి, రాజేష్, సునీత, ప్రత్యూష, ఎం మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మాస్కే కవచం

Tags: The risk of a corona pandemic is still looming.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *