కుందూ నది ఉగ్రరూపం

Date:20/09/2019

కడప  ముచ్చట్లు:

కడప జిల్లా పెద్దముడియం మండలంలో కుందూ నది వరద ప్రవాహం కాస్త తగ్గుతూ పెరుగుతూ వరద ఉధృతితో పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  గత ఐదు రోజులుగాకర్నూలు, కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కుందునది ఉధృతంగా ప్రవాహిస్తోంది. గురువారం  సాయంత్రం నుండి 35వేల క్యూసెక్కుల వరద ప్రవాహంతో శుక్రవారం ఉదయం  25వేలక్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. అయినా  మండలంలోని నెమళ్ల దిన్నే ,పెద్దముడియం బలపనగూడూరు, చిన్నముడియo, ఉప్పాలురు,గ్రామాల చుట్టూ కుందూ నది ప్రవహిస్తుంది.

 

 

 

నెమళ్లదిన్నే, పెద్దముడియం గ్రామాలలో నదీ పరివాహక పరిసరాల ఇంటి లోకి నీరు వచ్చి చేరడం జరిగింది. పలు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. రహదారులు కొట్టుకుపోయాయి.ఊర్లోకి నీళ్లు చేరాయి. అయితే మళ్ళీ ఉదయం నుండి వర్షం మొదలు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా బయటి ప్రాంతాలతోసంబంధాలు తెగిపోయినవి. ఆగ్రామాలు మళ్లీ కుందూ ప్రవాహం పెరిగితే ఇబ్బందులు పడే అవకాశం వుంది. ఇప్పటికీ అయితే అధికారులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా  తగుజాగ్రత్తలను తీసుకున్నారు. పోలీసులు ప్రత్యేక బలగాలు, గజ ఈతగాళ్లు రహదారులపై ప్రజలను దాటించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

 

 

 

ఈ ప్రాంతాల్లో ప్రతిచోటా పోలీసు సిబ్బందినినియమించి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. గజ ఈతగాళ్లను వాగులు, వంకలు, వరద వృద్ధి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు అవసరమైన సహాయక స్తున్నారు .  జమ్మలమడుగు నుండి ఆళ్లగడ్డ,చాగలమర్రి,కోవెలకుంట్ల ఇంకా కొన్ని ముఖ్య ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

కీచక ప్రిన్సిపాల్ పై విద్యార్ధిని ఫిర్యాదు

Tags: The river Kundu is a rage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *