Natyam ad

రోడెక్కని రోడ్ మ్యాప్…

విజయవాడ ముచ్చట్లు:


బీజేపీ జనసేన మధ్య మళ్లీ రోడ్‌ మ్యాప్‌ రచ్చ మొదలైందా? ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ తాజాగా ఎందుకంత అసహనంగా మాట్లాడారు? వైసీపీ విషయంలో ఏపీ బీజేపీ పెద్దలు ఢిల్లీలో ఏం చెప్పి వచ్చారు? వివాక హత్యకేసు తర్వాతి పరిణామాలను బీజేపీ పెద్దలు ఎలా చూస్తున్నారు? లెట్స్‌ వాచ్‌ఏపీలో రోడ్ మ్యాప్ రాజకీయాలు మరోసారి చర్చకు వచ్చాయి. బీజేపీ నుంచి మ్యాప్ రాకపోవడం వల్లే తానేం చేయలేకపోతున్నానని.. గతంలో చెప్పారు పవన్ కళ్యాణ్. అప్పట్లో దాని మీద పెద్ద చర్చే జరిగింది. అసలు పవన్ కోరుకుంటున్న రోడ్ మ్యాపేంటీ..? బీజేపీ ఏం ఇస్తానంది.. లాంటి చర్చోపచర్చలు జరిగాయి అప్పట్లో. అయితే ఆ తర్వాత అంతా లైట్‌ తీసుకున్నారు. తాజాగా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవధర్‌ చేసిన కామెంట్స్‌తో రోడ్ మ్యాప్ మళ్ళీ టాక్‌ ఆఫ్‌ ది ఏపీ అయింది. పవన్‌కు తాము ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేశామని.. కొత్తగా ఇప్పుడు ఏం లేదన్న దేవధర్‌ కామెంట్స్‌పై తిరిగి ఆసక్తికరమైన చర్చ మొదలైందట. ఢిల్లీ టూర్ వెళ్లొచ్చాక పవన్‌కు బీజేపీ అధినాయకత్వం చెప్పాల్సిన విషయాలన్ని చెప్పేసిందని, ఇక కొత్తగా ఏమీ లేదన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోందట. తెలంగాణ ఎన్నికలు, ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాల పైనా..

 

 

 

జనసేన అధినేతకు బీజేపీ హైకమాండ్ దిశా నిర్దేశం చేసిందన్నది ఇంటర్నల్‌ టాక్‌ అట. దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకున్నా.. కర్ణాటక ఎన్నికల తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నది ఏపీలో జరుగుతున్న చర్చ. అయితే పవన్ ప్రతిపాదించిన వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమనే కోణంలో రోడ్ మ్యాప్ ఉంటుందా..? లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా అన్న విషయంలో మాత్రం ఎక్కడా స్పష్టత లేదు.మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక, రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టాలని కిరణ్‌కు బాధ్యతల అప్పగింత వంటి అంశాలన్నీ బీజేపీ రోడ్ మ్యాపులో భాగమేనా..? అన్న ప్రచారం కూడా ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. అలాగే గతంలో మాదిరిగా ఇకపై ఏపీకి అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వంఉదాసీనంగా ఉండే అవకాశాలు తక్కువేనన్న చర్చ మొదలైంది. ఏ రాష్ట్రానికి లేని విధంగా రుణాల విషయంలో ఏపీకి వెసులుబాట్లు ఇస్తుండటం వల్ల బీజేపీ-వైసీపీ ఒకటేనన్న భావన పెరుగుతోందని రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు గట్టిగానే చెప్పారట.

 

 

 

Post Midle

అందుకే గతంలో పోల్చుకుంటే… ఇక మీదట ఏపీ ప్రభుత్వానికి బీజేపీ వైపు నుంచి అంత సహకారం ఉండకపోవచ్చన్న విశ్లేషణలు బయలుదేరాయి.ఇవన్నీ బీజేపీ-జనసేన రోడ్ మ్యాపులో భాగమేననే చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జోరుగా జరుగుతోందట.ఇదే సందర్భంలో మరో చర్చా మొదలైంది. సునీల్ దేవధర్‌ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడిన సందర్భంలో అంత అసహనానికి గురి కావాల్సిన అవసరమేముందన్నది కొందరి అభిప్రాయం అట. రోడ్ మ్యాప్ అంటే చాలు… బీజేపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్టు ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందట. నిజంగానే బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చి ఉంటే…ఇప్పటికే బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించేవని, అలా జరగలేదంటే.. ఎక్కడో తేడా కొట్టినట్టుగానే భావించాలని అంటున్నారు. అయితే హైకమాండ్‌తో అంతా సెట్ అయిందని.. అది అతి కొద్ది మందికి మాత్రమే దాని మీద క్లారిటీ ఉందంటున్నారు. క్లారిటీ మిస్ అయిన వారు.. తమకు తెలియదని చెప్పలేక.. ఇలా చిర్రుబుర్రులాడడం సహజమేనంటూ సునీల్ మీద సెటైర్లు వేసుకుంటున్నారట కొందరు కమలనాధులు.

 

Tags: The road map of the road…

Post Midle