The robbers in the KGF mine

కేజిఎఫ్ గని లో దొంగలు పడ్డారు

#చోరికి వెళ్ళిన ఆరుగురు దొంగలు
#ఊపిరాడక ముగ్గురు మృతి
#కొనసాగుతున్న ఆపరేషన్

Date:14/05/2020

కేజిఎఫ్ ముచ్చట్లు:

కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) బంగారు గనిలో దొంగతనంకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. అందిన సమాచారం మేరకు.కేజీఎఫ్ – మారికుప్పం మార్గంలోని మారికుప్పం పోలీసు స్టేషన్ సమీపంలోని MM Tenant zink బంగారు గనిలో చోరీ చేసేందుకు ఆరుగురు దొంగలు వెళ్లారు. గత
పదేళ్లుగా గనిలో బంగారు కార్యకలాపాలు నిలిచిపోయాయి. మూసేసిన ఈ బంగారు గనిలో చోరీకి కోసం కేజీఎఫ్ కు చెందిన 6 మంది దొంగలు బుధవారం రాత్రి బంగారు గనుల సొరంగం లోకి ప్రవేశం
వీరికి ఊపిరాడకపోవడంతో గట్టిగా కేకలు, అరుపులు చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రత సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గని వద్దకు చేరుకున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతోంది.
రెండు మృతదేహాలు వెలికితీశారు. లోతైన బంగారు గనిలో పడిపోయి మరణించిన దొంగల మృత దేహాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.80 అడుగుల లోతులో మరో మృత దేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. సంఘటన స్థలం వద్ద కెజిఎఫ్ పోలీసులు, బెంగళూరు అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులు కేజీఎఫ్ కు చెందిన జోసెఫ్, పడియప్ప, కందలుగా గుర్తించారు. బంగారు గనుల సొరంగం సుమారు వెయ్యి అడుగుల వరకు లోతు ఉంటుందని గోల్డ్ ఫీల్డ్ అధికారుల సమాచారం. ఈ మేరకు బెంగుళూరు నుండి వచ్చిన రెస్క్యూ బృంద సభ్యుల సహకారంతో పరిశీలిస్తూ చర్యలు చేపట్టగా, పోలీసుల ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హడలెత్తిస్తున్న చిరుత

Tags: The robbers in the KGF mine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *